ఇదీ నేనే!
నాకు ఊహ తెలిసినప్పటినుండి మా నాన్నగారు వీధి నాటకాలు వేసేవారు. పౌరాణికాలు వేయడంలో దిట్ట ఆయన. బహుశా వారి వారసత్వమే నాకబ్బినట్లుంది. నాక్కూడా పౌరాణికాలే ఇష్టం. నాటకాలపై ఉన్న మక్కువ టెలీ ఫిల్‌మ్స్‌లో నటించేదాకా తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్న బ్రహ్మదేవుడి గెటప్ స్టిల్ ఒక టెలీ ఫిలిం కోసం దిగింది. నా మిత్రులు, కుటుంబ సభ్యులు బ్రహ్మ వేషంలోని నన్ను గుర్తించకపోవడం కాస్త గర్వంగా ఉంటుంది. ఈ పాత్ర వేస్తున్నప్పుడు భక్తి పారవశ్యంతో మనసంతా నిండిపోయింది. మాది చిత్తూరు జిల్లా నగరి మండలం. ప్రస్తుతం ఎ.ఎస్.ఒ.గా ఉద్యోగం చేస్తున్నాను. 'ఇదీ నేనే' శీర్షిక ముఖంగా మీ ఆశీర్వాదాలు కోరుతున్నాను.
- టి. సుధాకర్, తిమ్మాపూర్, మహబూబ్‌నగర్ జిల్లా
96663 06925
విరించినై నటియించితిని
- టి. సుధాకర్, తిమ్మాపూర్, మహబూబ్‌నగర్ జిల్లా
96663 06925